Kangana Ranaut: 'చంద్రముఖి 2' ఫస్టు సింగిల్ ప్రోమో రిలీజ్!

  • సంచలన విజయాన్ని సాధించిన 'చంద్రముఖి'
  • సీక్వెల్ గా వస్తున్న 'చంద్రముఖి 2'
  • సంగీతాన్ని అందిస్తున్న కీరవాణి 
  • ఈ నెల 28వ తేదీన సినిమా విడుదల
Chandramukhi 2 Movie song promo released

'చంద్రముఖి' సినిమాతో దర్శకుడిగా పి.వాసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రజనీకాంత్ .. నయనతార .. ప్రభు .. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఆ సినిమాకి సీక్వెల్ గా 'చంద్రముఖి 2' రూపొందింది. ఈ సినిమాలో కంగనా రనౌత్ - లారెన్స్ ప్రధానమైన పాత్రలను పోషించారు.

'చంద్రముఖి' సినిమాకి విద్యాసాగర్ సంగీతాన్ని సమకూర్చగా, ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. పూర్తి లిరికల్ సాంగ్ ను రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

ఈ సినిమాలో కంగనా లుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది., ఇక ఈ తరహా సినిమాలు చేయడంలో లారెన్స్ కి మంచి అనుభవం ఉంది. అందువలన ఆయన వైపు నుంచి కూడా ఈ సినిమా ఉత్కంఠను పెంచుతోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 'చంద్రముఖి'కి మించి ఈ సినిమా ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడు అందరిలో కుతూహలాన్ని పెంచుతోంది.

More Telugu News