Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్రిమినల్ పిటిషన్

Chandrababu files criminal petition in AP High Court
  • అరెస్ట్, రిమాండ్ ను హైకోర్టులో సవాల్ చేసిన చంద్రబాబు
  • సీఆర్పీసీ సెక్షన్ 482 కింద క్రిమినల్ పిటిషన్ మెమోరాండం
  • ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని, రిమాండ్ ఆదేశాలను సస్పెండ్ చేయాలని అభ్యర్థన
  • తనపై నిర్దిష్ట ఆరోపణలేవీ లేవని స్పష్టీకరణ
తనను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 482 కింద 20 పేజీలతో కూడిన క్రిమినల్ పిటిషన్ మెమోరాండాన్ని న్యాయస్థానానికి సమర్పించారు. 

సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని హైకోర్టును కోరారు. తనపై సరైన సాక్ష్యాధారాలు లేకుండానే సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిపారు. రిమాండ్ ఆదేశాలు సస్పెండ్ చేయాలని, ఈ కేసులో తదుపరి చర్యలపై స్టే విధించాలని అభ్యర్థించారు. 

తనపై ఎలాంటి నిర్దిష్ట ఆరోపణలు లేవని చంద్రబాబు తన పిటిషన్ లో స్పష్టం చేశారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నవన్నీ అసంబద్ధమైన విషయాలేనని స్పష్టం చేశారు. రిమాండ్, స్పెషల్ కోర్టు చర్యలు చెల్లవని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ను పేర్కొన్నారు.
Chandrababu
Petition
AP High Court
TDP

More Telugu News