Pakistan: భారత్ ఇచ్చిన గిఫ్ట్ కి కృతజ్ఞతలు: పాకిస్థాన్ కోచ్

  • ప్రపంచకప్ ముందు ఈ ఓటమి తమకు మేల్కొలుపు అన్న బ్రాడ్ బర్న్
  • గడిచిన మూడు నెలల్లో తమకు ఓటమే లేదన్న పాక్ హెడ్ కోచ్
  • తాము మేటి ఆటగాళ్లతో తరచూ ఆడడం లేదని వెల్లడి
We are grateful to India for this gift Pakistan head coach

భారత్ చేతిలో పాక్ జట్టు ఘోర పరాభవాన్ని ఎదుర్కోగా.. పాకిస్థాన్ జట్టు కోచ్ మాత్రం భిన్నంగా స్పందించారు. సానుకూల దృక్పథంతో మాట్లాడారు. భారత్ జట్టు పాక్ పై 228 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేయగా, పాకిస్థాన్ జట్టు 128 పరుగులకే ఆటను ముగించేసింది. నిజానికి పాకిస్థాన్ కు ఇలాంటి ఓటమి ఇటీవలి కాలంలో ఎదురు కాలేదు. వన్డేల్లో పాకిస్థాన్ కు ఇది రెండో అతిపెద్ద ఓటమి. అందుకే ఈ ఓటమిని కనువిప్పుగా పాకిస్థాన్ జట్టు హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్ బర్న్ అభివర్ణించారు.


సాధారణంగా ఇలాంటి ఓటమి తర్వాత కఠిన వ్యాఖ్యలు, పునరాలోచన, మదింపు ఉంటుంటాయి. ఈ ఓటమిని గ్రాంట్ బ్రాడ్ బర్న్ ఓ మేల్కొలుపుగా భావించినట్టున్నారు. భారత్ తమకు గిఫ్ట్ ఇచ్చిందంటూ ధన్యవాదాలు చెప్పాడు. ప్రపంచకప్ కు ముందు భారత్ చేతిలో ఓటమి తమకు కనువిప్పుగా అభివర్ణించాడు. ‘‘గడిచిన రెండు రోజుల్లో మాకు వచ్చిన కానుక పట్ల గొప్పగా భావిస్తున్నాం. మేము ప్రపంచంలో మేటి ప్లేయర్లతో తరచూ ఆడడం లేదు. గత మూడు నెలల కాలంలో ఒక్క గేమ్ లోనూ ఓడిపోయింది లేదు. ప్రతి రోజూ తగిన విధంగా సన్నద్ధం కావాలనే దాన్ని ఇది గుర్తు చేస్తోంది’’ అని బ్రాడ్ బర్న్ పేర్కొన్నారు.

More Telugu News