Shahrukh Khan: నాలుగే రోజులు .. 520 కోట్లు .. 'జవాన్'కి సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్!

  • ఈ నెల 7వ తేదీన విడుదలైన 'జవాన్'
  • విడుదలైన ప్రతి ప్రాంతంలో వీరవిహారం 
  • షారుక్ ద్విపాత్రాభినయం హైలైట్ 
  • 4 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమా
Jawan Movie Update

షారుక్ ఖాన్ హీరోగా 'జవాన్' సినిమా తెరకెక్కింది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అట్లీ కుమార్ దర్శకత్వం వహించాడు. షారుక్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, దీపికా పదుకొణె - నయనతార కీలకమైన పాత్రలను పోషించారు. సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీన థియేటర్లకు వచ్చింది.

తొలి రోజున ఈ సినిమా 129.6 కోట్లను .. రెండో రోజున 240.47 కోట్లను .. మూడో రోజున 384.69 కోట్లను .. నాలుగో రోజున 520.79 కోట్లను వసూలు చేసింది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం విశేషం. దాంతో షారుక్ అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ జాబితాలో అట్లీ కుమార్ ఉన్నప్పటికీ, బాలీవుడ్ లో ఆయనకీ ఇది ఫస్టు మూవీ. అలాగే ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించిన నయనతారకి కూడా బాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా. కథాకథనాలు .. షారుక్ నటన .. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్రను పోషించాయని అంటున్నారు. 

More Telugu News