Chandrababu: రాజమండ్రి జైల్లో భారీ భద్రత.. ఆ బ్లాక్‌లోకి వెళ్లాలంటే చంద్రబాబు అనుమతి తప్పనిసరి!: సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు

Ponnavolu on Chandrababu Naidu jail custody
  • ఓ బ్లాక్ మొత్తం చంద్రబాబుకే... సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్న పొన్నవోలు
  • సీఆర్పీ చట్టంలో అసలు హౌస్ రిమాండ్ అనేది లేదని వెల్లడి
  • స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ.371 కోట్ల ఖజానా దోపిడీకి గురైందన్న సీఐడీ న్యాయవాది
  • కుంభకోణం ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారా వెల్లడవుతోందన్న న్యాయవాది
రాజమండ్రి కేంద్రకారాగారంలో ఎన్ ఎస్ జీ ప్రొటక్షన్ కంటే ఎక్కువ భద్రతను కల్పించామని, టీడీపీ అధినేత చంద్రబాబు అనుమతి లేకుండా ఎవరూ కూడా వారి బ్లాక్ వద్దకు కూడా వెళ్లలేరని సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆయన కోసం ఓ బ్లాక్ మొత్తం కేటాయించామని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన హౌస్ కస్టడీ పిటిషన్‌పై స్పందిస్తూ... సీఆర్పీ చట్టంలో అసలు హౌస్ రిమాండ్ అనేది లేదన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ పథకం పేరుతో రూ.371 కోట్ల రాష్ట్ర ఖజానా దోపిడీకి గురైందన్నారు. షెల్ కంపెనీలపై జీఎస్టీకీ ఆధారాలు దొరికాయన్నారు. గత ప్రభుత్వ పెద్దలు ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. ప్రజల సొమ్ము దొంగ కంపెనీల ద్వారా ఓ వర్గం చేతిలోకి వెళ్లిందన్నారు. కుంభకోణం ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తోందన్నారు. థర్డ్ పార్టీ అసెస్‌మెంట్ ఎక్కడా జరగలేదన్నారు.

ఎలాంటి చర్చ లేకుండానే ఎంవోయూలు కుదుర్చుకున్నారని, అసలు డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు ఫండ్స్ ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి మేం చేశామని నాటి సీఎస్ చెప్పారన్నారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ప్రభుత్వం భారీ భద్రతను కల్పించిందని, 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. ఆయనకు కావాల్సిన ఆహారం, మందులు అందుతున్నాయన్నారు. సహృదయంతో చంద్రబాబు విన్నపాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరూ అతీతులు కాదన్నారు.
Chandrababu
cid
Andhra Pradesh

More Telugu News