iPhones: ఐఫోన్లలో భారత యూజర్ల కోసమే ప్రత్యేక ఫీచర్లు

  • సిరీతో తెలుగులో మాట్లాడొచ్చు, ఆదేశాలు ఇవ్వొచ్చు
  • చెప్పిన టాస్క్ చేసేలా ఐవోఎస్ 17లో ఫీచర్లు
  • సిమ్ కార్డుల మధ్య వ్యక్తిగత సందేశాల విభజన
India centric features coming soon to iPhones

యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ నెల 12న యాపిల్ కార్యక్రమం నిర్వహిస్తోంది. యాపిల్ పార్క్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం నిర్వహించనున్నారు. యూట్యూబ్ నుంచి వీక్షించొచ్చు. ఈ కార్యక్రమంలో ఐవోఎస్ 17ను యాపిల్ ఆవిష్కరించనుంది. అయితే ఐవోఎస్ (ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్) 17లో భారత యూజర్ల కోసమే ఉద్దేశించిన ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. 

  • ఐవోఎస్ 17 సిరీతో ఒకటికి మించిన భాషలను మిక్స్ చేసి మాట్లాడొచ్చు. ఇంగ్లిష్, హిందీ కలిపి.. లేదంటే ఇంగ్లిష్ తో తెలుగు, పంజాబీ, కన్నడ, మరాఠి భాషలను కలిపి మాట్లాడొచ్చు. 'సిరీ.. ప్లీజ్ సెట్ అలారమ్' అని అలారమ్ ను సెట్ చేయాలని కోరొచ్చు. మ్యూజిక్ ప్లే చేయాలని కోరొచ్చు. తెలుగులోనే ఈ ఆదేశాలు ఇవ్వొచ్చు.
  • తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం తదితర భాషల్లో కీబోర్డును ఉపయోగించొచ్చు. ఒక భాష నుంచి మరో భాషకు మారిపోవచ్చు. 
  • ఐవోఎస్ 17 ప్రైమరీ, సెకండరీ సిమ్ మధ్య మెస్సేజెస్ ను వేరు చేస్తుంది. దీంతో ఆఫీస్ సందేశాలతో, వ్యక్తిగత సందేశాలు కలసిపోయి కలగాపులగంగా లేకుండా ఉంటాయి. ప్రతీ సిమ్ కు మెస్సేజ్ కు సంబంధించి వేర్వేరు రింగ్ టోన్ పెట్టుకోవచ్చు.
  • మిస్డ్ కాల్ కనిపిస్తే , ఆ నంబర్ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేయకపోయినా నేరుగా కాల్ బ్యాక్ చేసుకోవచ్చు.

More Telugu News