Panchumarthi Anuradha: వైసీపీలోని ప్రతి డకోటా గాడికి ముందుంది మొసళ్ల పండగ: పంచుమర్తి అనురాధ

All YSRCP leaders will face problems says Panchumarthi Anuradha
  • చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అన్న అనురాధ
  • వైసీపీ 151 అడుగుల గొయ్యి తవ్వుకుందని వ్యాఖ్య
  • వైఎస్సార్ కూడా చంద్రబాబు వెంట్రుక  కూడా పీకలేకపోయాడని తీవ్ర వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యానికి చీకటి రోజని అన్నారు. వైసీపీలో ఉన్న ప్రతి డకోటాగాడికి ముందుంది మొసళ్ల పండుగ అని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ పతనం ప్రారంభమయిందని... 151 సీట్లు ఉన్న వైసీపీ తనకు తాను 151 అడుగుల గొయ్యి తవ్వుకుందని చెప్పారు. 

పోలవరం ప్రాజెక్టుకి ఎన్ని గేట్లు ఉంటాయో కూడా తెలియని అంబటి రాంబాబు చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. అంబటి రాంబాబును దద్దమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చెప్పిందని... అయినప్పటికీ న్యాయ వ్యవస్థను కించపరిచేలా అంబటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు మీద వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో కేసులు వేశారని... అయినా చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేకపోయారని... ఈ జగన్ ఎంతని ఎద్దేవా చేశారు. ఎల్లేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరిగిందని ఆనాడు చంద్రబాబుపై వైఎస్... సోమశేఖర్ కమిషన్ వేశారని, కానీ ఏమీ నిరూపించలేక తోక ముడిచారని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారని... ప్రజలకు ఎంతో సేవ చేశారని చెప్పారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే సీన్ రిపీట్ కాబోతోందని చెప్పారు. 
Panchumarthi Anuradha
Chandrababu
Telugudesam
YSR
Jagan
YSRCP

More Telugu News