Budda Venkanna: మీ మాదిరి లక్ష కోట్లు దోచుకోలేదు: బుద్దా వెంకన్న

Budda Venkanna fires on Jagan
  • ఇంటి వద్ద బుద్దా వెంకన్నను అడ్డుకున్న పోలీసులు
  • అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన వైనం
  • జగన్ ను ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్న వెంకన్న

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో బుద్దా వెంకన్న వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తనకు ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉందంటూ ఆయనను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఓటమి భయంతోనే జగన్ కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆధారాలు లేకుండానే అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ పైశాచిక ఆనందం పొందొచ్చేమో కానీ... ఈ కేసు నుంచి చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పారు. మీ మాదిరి లక్ష కోట్లు దోచుకోలేదని అన్నారు. మీ 43 వేల కోట్ల సీజ్ గురించి మాట్లాడాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడం ఖాయమని అన్నారు.

  • Loading...

More Telugu News