Eluru SP: నిరసనలు, ధర్నాలు, బంద్ పాటిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: ఏలూరు జిల్లా ఎస్పీ

  • టీడీపీ బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత
  • జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్న ఎస్పీ మేరీ ప్రశాంతి
  • రోడ్ల పైకి వచ్చి అల్లర్లు చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్
Eluru SP warning to TDP protesters

జిల్లాలో ఎక్కడా ధర్నాలకు, నిరసనలకు, బంద్ కు అనుమతి లేదని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. బస్సుల రవాణాకు ఆటంకాలు కలిగించినా, నిరసన, ధర్నాలు చేపట్టినా... పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జన జీవనానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా, రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేసినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పిలుపునిచ్చిన బంద్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More Telugu News