AP High Court: రోడ్డు ప్రమాదం.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తికి తీవ్రగాయాలు

AP High court judge v sujatha injured in road accident in suryapet
  • సూర్యాపేట జిల్లా చివ్వెల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో రోడ్డు ప్రమాదం
  • వర్షంలో న్యాయమూర్తి కారు అదుపుతప్పి పల్టీ కొట్టిన వైనం
  • తీవ్రంగా గాయపడ్డ న్యాయమూర్తికి సమీప ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • అనంతరం, మెరుగైన చికిత్స కోసం మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్‌లో హైదరాబాద్‌కు తరలింపు 
సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వి.సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, జడ్జిని హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వర్షంలో ఆమె ప్రయాణిస్తున్న కారు చివ్వెల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో న్యాయమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలియగానే తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఆమెను మెరుగైన చికిత్స కోసం తన కాన్వాయ్‌లో హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు అలర్టై జాతీయ రహదారి పొడవునా కాన్వాయ్‌కు అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
AP High Court
Justice. V. Sujatha
Suryapet District
Road Accident

More Telugu News