Chandrababu: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు

Chandrababu advocates files bail petition
  • చంద్రబాబుకు రిమాండ్
  • టీడీపీ అధినేతను రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం
  • ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు
స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం తెలిసిందే. కోర్టు రిమాండ్ విధిస్తున్న తీర్పు వెలువరించిన అనంతరం... ఇదే కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో, చంద్రబాబును రాజమండ్రి కారాగారానికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ పోలీసు వాహనం నేరుగా కోర్టు  ప్రాంగణంలోకి ప్రవేశించింది.
Chandrababu
Bail Petition
ACB Court
Remand

More Telugu News