చాలెంజ్ చేసి చెబుతున్నా... అమిత్ షా అనుమతితోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు: సీపీఐ నారాయణ
- చంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
- చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందన్న నారాయణ
- మోదీ, అమిత్ షాకు తెలియకుండా ఓ మాజీ సీఎంను అరెస్ట్ చేయలేరని వెల్లడి
- బీజేపీ కాపాడుతుందని చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని వ్యాఖ్యలు
"నేను చాలెంజ్ చేస్తున్నా... అమిత్ షాకు తెలియకుండా చంద్రబాబునాయుడ్ని అరెస్ట్ చేసే అవకాశం లేదు. జగన్ మోహన్ రెడ్డి... అమిత్ షా అనుమతితోనే చంద్రబాబును అరెస్ట్ చేశాడు. ఇప్పుడు రాజకీయాలు ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలి. దీనివెనుక ఎవరున్నారో ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకోవాలి. బీజేపీ కాపాడుతుందని చంద్రబాబు భ్రమల్లో ఉన్నారు. అమిత్ షా ఒక్క మాట అంటే చాలు జగన్ భయపడిపోతాడు. బీజేపీ హస్తం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. బీజేపీని, వైసీపీని దూరంగా పెడితే తప్ప తెలుగు ప్రజలకు న్యాయం జరగదు" అని నారాయణ స్పష్టం చేశారు.