Andhra Pradesh: అవినీతి బాబు ని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి కర్మ ‘బ్రో’: అంబటి రాంబాబు

Ambati Rambabu satirical tweet on Pawan Kalyan
  • బాబుకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన పవన్‌ను అడ్డుకున్న పోలీసులు
  • రోడ్డుపై పడుకొని నిరసన తెలిపిన జనసేన అధినేత
  • ఈ ఫోటోను ట్విట్టర్‌‌ లో షేర్ చేసి సెటైర్ వేసిన మంత్రి అంబటి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆరోపణల్లో అరెస్టయిన చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు పవన్ నిన్న విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వాహనం దిగి నడుకుంటూ వెళ్తానని చెప్పారు. కానీ పోలీసులు కదలనీయకపోవడంతో రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. ఈ ఫొటోను అంబటి రాంబాబు ట్విట్టర్‌‌ లో షేర్ చేశారు.

అవినీతి బాబుని అరెస్ట్ చేస్తే  నీకు ఇదేమి కర్మ ‘బ్రో’ అని వ్యంగ్య క్యాప్షన్ ఇచ్చారు. మరోవైపు వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ కూడా పవన్‌పై విమర్శలు గుప్పించింది. ‘రూ. 371 కోట్ల స్కిల్ స్కామ్ చేసి యువత భవితను నాశనం చేసిన వ్యక్తి కోసం ఎందుకు  పవన్ కల్యాణ్ ఈ ఆరాటం? నీకు ఆ స్కామ్ లో ఎంత ముట్టి ఉండకపోతే ఇంతలా అరాటపడతావ్! మొత్తానికి మీది ప్యాకేజీ బంధం అని చెప్పకనే చెప్తున్నావ్’ అని ట్వీట్ చేసింది.
Andhra Pradesh
YSRCP
Pawan Kalyan
Ambati Rambabu
Chandrababu

More Telugu News