PM Modi: జీ20లో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం

  • ప్రతిపాదించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • సభ్య దేశాలన్నీ ఏకాంగీకారం
  • జీ20 బలపడుతుందన్న  ఆకాంక్ష
PM Modi welcomes African Union as G20 permanent member with a big hug

జీ20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ప్రత్యేక చొరవ చూపించింది. ఈ కూటమిలోకి ఆఫ్రికన్ యూనియన్ ను సైతం భాగస్వామిని చేసింది. జీ20 దేశాల కూటమిలోకి ఆఫ్రికన్ యూనియన్ ను శాశ్వత సభ్య దేశంగా చేర్చుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 50 దేశాలతో కూడిన ఆఫ్రికన్ యూనియన్ ను శాశ్వత మెంబర్ గా చేర్చే ప్రతిపాదనను ప్రధాని మోదీ సదస్సులో ప్రకటించగా, దీనికి అన్ని సభ్య దేశాలూ స్వాగతం పలికాయి. ‘‘మీ అందరి మద్దతుతో జీ20లో చేరాలని ఆఫ్రికన్ యూనియన్ ను ఆహ్వానిస్తున్నాను’’అని ప్రధాని మోదీ ప్రకటించారు.

ఆమోదం అనంతం యూనియన్ ఆఫ్ కొమోరాస్, ఆఫ్రికన్ యూనియన్ చైర్ పర్సన్ అజాలి అస్సోమనీని ప్రధాని మోదీ వేదికపైకి ఆహ్వానించారు. ఆఫ్రికా యూనియన్ పేరుతో ప్రత్యేకించిన సీటు వరకు అస్సోమనీని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తోడ్కొని వచ్చారు. ఈ సందర్భంగా సదస్సు అంతటా చప్పట్ల మోత మోగింది. అందరి సమన్వయంతో అన్న భారత్ విధానానికి అనుకూలంగా ఆఫ్రికన్ యూనియన్ కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని భారత్ ప్రతిపాదించినట్టు చెప్పారు. 

ఈ సందర్భంగా ప్రధాని ఒక ట్వీట్ చేశారు. ‘‘జీ20 కుటుంబంలోకి శాశ్వత సభ్యురాలిగా ఆఫ్రికన్ యూనియన్ ను ఆహ్వానిస్తున్నాను. ఇది జీ20ని బలోపేతం చేస్తుంది. అలాగే, అంతర్జాతీయంగా దక్షిణాది స్వరం బలపడుతుంది’’అని ట్వీట్ చేశారు.

More Telugu News