Bengaluru: నడివీధిలో నిలిచిపోయిన హెలికాఫ్టర్.. భారీగా ట్రాఫిక్ జాం

  • బెంగళూరులో వెలుగు చూసిన దృశ్యం
  • హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సమీపంలో నడివీధిలో నిలిచిపోయిన హెలికాఫ్టర్
  • సోషల్ మీడియాలో ఈ ఘటన తాలుకు దృశ్యాలు వైరల్
  • కొంటె జోకులతో పెద్ద ఎత్తున స్పందించిన నెటిజన్లు
Helicopter lands in the middle of the road in bengaluru causing traffic jam

భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అక్కడి ట్రాఫిక్ సమస్యే. ట్రాఫిక్ జాంలు అక్కడ నిత్యకృత్యం. అయితే, తాజాగా ఓ హెలికాఫ్టర్ కారణంగా బెంగళూరులో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 

నగరంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కార్యాలయానికి సమీపంలో రోడ్డు మధ్యలో ఈ హెలికాఫ్టర్ ల్యాండయ్యింది. దీంతో, రహదారిపై వాహనాలు చాలా సేపు నిలిచిపోయాయి. ఓ సాధారణ కారో, మరో వాహనం లాగానో హెలికాఫ్టర్ రోడ్డుపై నిలిచిపోవడంతో స్థానికులు తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు నెటిజన్లు ఛలోక్తులు కూడా విసిరారు. ‘‘డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు వాహనదారులకే కాదు పైలెట్లకు కూడా చేస్తూ ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు’’ అంటూ ఓ వ్యక్తి పంచ్ వేశాడు.

More Telugu News