BJP: బీజేపీలో వెయ్యి దాటిన ఎమ్మెల్యే ఆశావహుల దరఖాస్తులు

BJP mla application crosses thousand
  • 4వ తేదీన ప్రారంభమైన ఎమ్మెల్యే ఆశావహుల నుంచి  దరఖాస్తుల స్వీకరణ
  • ఐదు రోజుల్లో వెయ్యి దాటిన జాబితా
  • టిక్కెట్ కోసం చెన్నమనేని, జితేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి దరఖాస్తు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడం కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నెల 4వ తేదీ నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆశావహుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొదటి రోజునే 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఐదు రోజుల్లో ఆశావహుల నుండి వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి.

వేములవాడ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఈ రోజు చెన్నమనేని వికాస్ రావు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ టిక్కెట్ కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి దరఖాస్తు చేశారు. వరంగల్ వెస్ట్ టిక్కెట్ కోసం ఏనుగు రాకేశ్ రెడ్డి ఆసక్తి చూపారు. కాగా, సీనియర్ నేతలైనా కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ కే లక్ష్మణ్ తదితరులు ఇంకా దరఖాస్తు చేయాల్సి ఉందని తెలుస్తోంది.
BJP
Telangana
Telangana Assembly Election

More Telugu News