Kishan Reddy: ఎన్నికలకు సిద్ధంకండి: కిషన్ రెడ్డి

Kishan Reddy calls BJP cadre to prepare for elections
  • తెలంగాణకు కేంద్రం రూ. 27 లక్షల కోట్లను ఇచ్చిందన్న కిషన్ రెడ్డి
  • ఒక్క ఎన్నికల హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శ
  • మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడి
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఏ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలను కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు. మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. వివిధ పథకాల కింద తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రూ. 27 లక్షల కోట్లను ఇచ్చిందని తెలిపారు. పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఇచ్చిన హామీని కేసీఆర్ తప్పారని విమర్శించారు.
Kishan Reddy
BJP
KCR
BRS

More Telugu News