Kesineni Nani: టీడీపీని వీడుతున్నారనే ప్రచారంపై ఎంపీ కేశినేని నాని స్పందన

Kesineni Nani says he will not leave Telugudesam Party
  • టీడీపీని వీడేది లేదని, వచ్చే ఎన్నికల్లోను ఇదే పార్టీ నుండి పోటీ చేస్తానని స్పష్టీకరణ
  • వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడోసారి లోక్ సభకు వెళ్తానని ధీమా
  • చంద్రబాబు ఎలాంటి అవినీతి మచ్చ లేని నాయకుడని కితాబు
తాను పార్టీ మారుతానని జరుగుతోన్న ప్రచారంపై విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని స్పందించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ తాను తెలుగుదేశం పార్టీ నుండే ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచి తాను మూడోసారి లోక్ సభకు వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రజాసేవ ముఖ్యమని, అప్పుడు పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. పార్టీల మధ్య పొత్తుల గురించి అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రూ.118 కోట్ల అవకతవకల గురించి ఐటీ నోటీసులు రావడంపై కూడా ఎంపీ స్పందించారు. దేశంలో నిజాయతీ కలిగిన అతికొద్దిమంది నేతల్లో తమ పార్టీ అధినేత చంద్రబాబు ఒకరని అన్నారు. ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చ లేదన్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమని, దానికి ఆయన సమాధానం ఇస్తారన్నారు.
Kesineni Nani
Telugudesam
Chandrababu
Andhra Pradesh

More Telugu News