Volunteer: అంగళ్లులో కర్ణాటక మద్యం అమ్ముతూ పట్టుబడ్డ వాలంటీర్లు.. వీరిలో ఒక మహిళా వాలంటీర్!

Two volunteers including a women arrested for selling Karnatak liquor in Angallu
  • కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతున్న వాలంటీర్లు
  • సందీప్ కుమార్, లేపాక్షి అమ్మాజీలు అరెస్ట్
  • 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు ఇటీవలి కాలంలో బాగా పాప్యులర్ అయింది. ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అంగళ్లు వార్తల్లోకి ఎక్కింది. వివరాల్లోకి వెళ్తే అంగళ్లులోని ఇద్దరు వాలంటీర్లు సందీప్ కుమార్, లేపాక్షి అమ్మాజీలు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారు. వీరికి కర్ణాటకకు చెందిన నడిపిరెడ్డి సహకరిస్తున్నాడు. వీరు అక్రమ మద్యాన్ని అమ్ముతున్నట్టు గుర్తించిన అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి కర్ణాటక మద్యంతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింది వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా... కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. స్థానికంగా ఉండే ఒక వైసీపీ నేత సహకారంతో వీరు మద్యం విక్రయాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Volunteer
Liquor
Angallu

More Telugu News