Madhuri Dixit: లోదుస్తుల్లో నటిస్తానన్న మాధురి దీక్షిత్ మాట తప్పడంతో సినిమా ఆగిపోయింది: టినూ ఆనంద్

When Tinnu anand asked madhuri to leave the set of film with amitabh in lead role

  • తన దర్శకత్వంలో అమితాబ్, మాధురి జంటగా సినిమా ప్లాన్ చేశానన్న టినూ 
  • 1989లో షూటింగ్ ప్రారంభమై ఐదు రోజుల్లోనే నిలిచిపోయిందని వెల్లడి  
  • ఓ కీలక సన్నివేశంలో మాధురిని లోదుస్తుల్లో చూపించాలనుకున్నట్టు తెలిపిన టినూ
  • చెప్పినట్టు నటించకపోతే వెళ్లిపో అని తాను అనడంతో ఆమె సెట్‌ను వీడిందని వెల్లడి   

లోదుస్తుల్లో నటించేందుకు తొలుత అంగీకరించిన నటి మాధురి దీక్షిత్ ఆ తరువాత కాదనడంతో ఓ సినిమా నిలిపివేయాల్సి వచ్చిందని బాలీవుడ్ నటుడు, దర్శకుడు టినూ ఆనంద్ పేర్కొన్నారు. 1989లో తన దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్ హీరోహీరోయిన్లుగా మొదలైన ‘Shanakht’ సినిమా షూటింగ్ ఐదో రోజునే నిలిచిపోవడానికి గల కారణాలను ఆయన తాజాగా వివరించారు. 

‘‘బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్, నటి మాధురి దీక్షిత్ జంటగా 1989లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించా. వాళ్లిద్దరి కాంబోలో అదే తొలి చిత్రం కావడంతో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమాలోని ఓ సీక్వెన్స్‌లో అమితాబ్‌ను కొందరు రౌడీలు బంధిస్తారు. అయినా.. రౌడీల నుంచి హీరోయిన్‌ను కాపాడేందుకు ఆయన ఎంతో శ్రమిస్తారు. ఈ క్రమంలో హీరోయిన్ హీరోతో అన్ని విధాలుగా దగ్గరవ్వాలని అనుకుంటుంది. ఈ కీలకమైన సన్నివేశంలో హీరోయిన్‌ను లోదుస్తుల్లో చూపించాలనుకున్నా. అదే విషయాన్ని మాధురి దీక్షిత్‌కు చెప్పా. ఆమె మొదట ఓకే అన్నారు. తీరా షూటింగ్ రోజు లోదుస్తులతో యాక్ట్ చేయనన్నారు. 

దీంతో, ఆమెతో నాకు గొడవ జరిగింది. ఈ సీన్ చేయకపోతే సెట్‌లోంచి వెళ్లిపోమన్నా. దీంతో, ఆమె తన బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది’’ అంటూ నాటి విషయాలను ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అన్నట్టు, టినూ ఆనంద్ 'ఆదిత్య 369' తెలుగు సినిమాలో నటించిన సంగతి విదితమే! 

Madhuri Dixit
Tinnu Anand
Amitabh Bachchan
Bollywood
  • Loading...

More Telugu News