Bhumana Karunakar Reddy: ఆవు పాలు పితికిన టీటీడీ చైర్మన్ భూమన

Bhumana milking a cow at Goshala
  • ఎస్వీ గోశాల, గో మందిరాన్ని దర్శించిన భూమన కరుణాకర్ రెడ్డి
  • ప్రతి ఒక్కరూ గో సంరక్షణ చేపట్టాలని పిలుపు
  • సాహివాల్ జాతి ఆవుల అభివృద్ధికి కేంద్రం రూ.49 కోట్లు మంజూరు చేసిందని వెల్లడి
కృష్ణాష్టమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వీ గోశాల, అలిపిరి వద్ద ఉన్న గో మందిరంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడి ఆలయంలో స్వామివారికి పూజలు జరిపారు. ఓ ఆవు నుంచి స్వయంగా పాలు పితికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  గో సంరక్షణ బాధ్యత భారతీయులందరిపైనా ఉందని తెలిపారు. గోవులను తల్లిగా పూజించడం మన సంస్కృతిలో భాగమని అన్నారు. సాహివాల్ జాతి ఆవుల అభివృద్ధికి కేంద్రం రూ.49 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు.
Bhumana Karunakar Reddy
Cow
Milking
Goshala
Alipiri
TTD

More Telugu News