Roja: చంద్రబాబు విచారణ ఎదుర్కొంటారా? లేక బాలకృష్ణ మాదిరి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారా?: రోజా

Can Chandrababu bring mental certificate like Balakrishna asks Roja
  • రూ. 118 కోట్ల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని రోజా ప్రశ్న
  • తనను అరెస్ట్ చేస్తారంటూ సింపతీ కోసం మాట్లాడుతున్నారని విమర్శ
  • చంద్రబాబు, లోకేశ్ లను జైల్లో పెడితేనే మంచిదని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణలను ఉద్దేశించి ఏపీ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూ. 118 కోట్ల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు విచారణ ఎదుర్కొంటారా? లేక బాలకృష్ణలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సింపతీ కోసమేనని చెప్పారు. అలిపిరిలో బాంబు పేలినప్పుడే ఆయనపై సింపతీ రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. చంద్రబాబు, నారా లోకేశ్ లను జైల్లో పెడితేనే ప్రజలకు మేలు అని అన్నారు. విజయ్ మాల్యా మాదిరి చంద్రబాబు విదేశాలకు పారిపోయే అవకాశం కూడా ఉందని ఆమె చెప్పారు.

Roja
YSRCP
Chandrababu
Nara Lokesh
Balakrishna
Telugudesam

More Telugu News