45 మంది మహిళలపై పాక్ లో స్కూల్ ప్రిన్సిపాల్ అరాచకం
- కరాచీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం
- ఉద్యోగం పేరుతో లైంగిక కార్యకలాపాలు
- సీసీటీవీ ఫుటేజీలు చూపించి బెదిరింపులు
గఫూర్ ఫోన్ నుంచి 25 షార్ట్ వీడియో క్లిప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళా టీచర్ తో గఫూర్ ఏకాంతంగా ఉన్న ఒక వీడియో బయటకు రావడంతో చీకటి క్రీడ వెలుగు చూసింది. ప్రిన్సిపాల్ గఫూర్ కు స్థానిక కోర్టు ఏడు రోజులు రిమాండ్ విధించింది. ఉద్యోగం ఆశ చూపించి మహిళా టీచర్లపై గఫూర్ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పోలీసులు వెల్లడించారు. వారితో సన్నిహితంగా ఉన్న వీడియోలు చూపిస్తూ బెదిరించే వాడని తెలుసుకున్నారు. దీనిపై విచారణకు సర్కారు కమిటీని నియమించింది. గఫూర్ చేతిలో తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు ఐదుగురు మహిళలు ఇప్పటి వరకు ముందుకు వచ్చారు.