India: ఇండియా పేరు మార్పు కొత్తగా జరిగిందేం కాదు.. బ్రిక్స్ సమావేశాల్లోనే 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని రాశారు

  • గత నెల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశాలు
  • సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని పేర్కొన్న వైనం
  • జీ20 సమ్మిట్ లో పాల్గొనే అధికారులకు 'భారత్ అఫీషియల్' అని ఐడీ కార్డులు
Bharat mentioned instead of India in BRICS summit

ఇండియా పేరును భారత్ గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నెలలో జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 9న జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డులపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం పెను సంచలనంగా మారింది. అయితే, పేరు మార్పు ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే శ్రీకారం చుట్టింది. 

గత నెల 22 నుంచి 25 వరకు దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. దక్షిణాఫ్రికాలోని జొహానెస్ బర్గ్ లో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్ లో 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని రాశారు. గత నెల 23న చంద్రయాన్-3 సక్సెస్ అయింది. అంటే చంద్రయాన్-3 విజయవంతం కావాడానికి ముందే భారత్ అనే పేరును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వాడిందనే విషయం అర్థమవుతోంది. ఇంకోవైపు ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్ లో పాల్గొనే భారత అధికారుకు గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఇందులో 'ఇండియన్ అఫీషియల్'కు బదులు 'భారత్ అఫీషియల్' అని పేర్కొన్నారు. 

ఇంకోవైపు ఈరోజు, రేపు ఇండొనేషియాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఆసియన్-ఇండియా సమ్మిట్, ఈస్ట్ ఆసియా సమ్మిట్ లలో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్లలో కూడా మోదీని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ గా పేర్కొన్నారు.

More Telugu News