Raviteja: ఏక్ ధమ్, ఏక్ ధమ్ నచ్చేశావే.. ఎల్లాకిల్లా పడేశావే అంటున్న రవితేజ

  • రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’
  • తొలి పాట విడుదల చేసిన చిత్ర బృందం
  • అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
First lyrical from Tiger Nageswara Rao Ek Dum Ek Dum releases

హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంటారు సీనియర్ హీరో రవితేజ. వాల్తేరు వీరయ్య, రావణాసుర తర్వాత ఈ ఏడాది ఆయన నుంచి వస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ప్యాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో నుపూర్ సనన్‌ టాలీవుడ్‌ కు హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రవితేజ ఇందులో స్టూవర్టుపురం దొంగ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌‌ సినిమాపై అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పాట విడుదలైంది.

‘ఏక్ ధమ్, ఏక్ ధమ్ నచ్చేశావే.. ఎల్లాకిల్లా పడేశావే’అంటూ సాగే పాటలో హీరో రవితేజ.. హీరోయిన్‌ నుపూర్ సనన్‌ని ఆట పట్టిస్తూ కనిపించాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడాడు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించాడు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.  కాగా, ఈ చిత్రం దసరా కానుకగా పలు భాషల్లో అక్టోబర్ 20న విడుదల కానుంది.

More Telugu News