నాని, శర్వా వదులుకున్న రజనీకాంత్ ప్రాజెక్టులోకి రానా!
- జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవర్ 170వ చిత్రం
- ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న రానా
- జైలర్‌తో భారీ హిట్ ను ఖాతాలో వేసుకున్న రజనీకాంత్
లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమా రజనీకాంత్ కెరీర్‌లో 170వది. ఇందులో రానా కీలకపాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. ముందుగా ఈ పాత్ర కోసం నాని, శర్వానంద్‌ను సంప్రదించినా వాళ్లు ఒప్పుకోలేదని.. రానా మాత్రం అంగీకరించాడని టాలీవుడ్ సమాచారం. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ బడా స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు ఫహద్ ఫాజిల్, మంజు వారియర్ లాంటి అగ్ర తారలు నటించనున్నారు.