IND vs PAK: చుక్కలనంటిన భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధర

Fans vexed after price of IND vs PAK World Cup tickets explodes to INR 57 lakhs
  • అక్టోబర్ 14 నాటి మ్యాచ్ టికెట్ ధర రూ.57 లక్షలు
  • కనిష్ఠ ధర రూ.57,198
  • సెకండరీ మార్కెట్ లో నెలకొన్న పరిస్థితి
  • టికెట్ల బ్లాక్ మార్కెట్ అంటూ మండి పడుతున్న అభిమానులు
వన్డే ప్రపంచకప్ టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్ టికెట్ కోసం తెగపోటీ నెలకొంది. ఒక టికెట్ ధర రూ.57 లక్షలకు చేరిందంటే అభిమానుల్లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వన్డే ప్రపంచకప్ 2023కు సంబంధించి అన్ని వార్మప్, లీగ్ దశ మ్యాచ్ టికెట్ల విక్రయాలు సెప్టెంబర్ 3న ముగిశాయి. ఆగస్ట్ 25 నుంచి 29వ తేదీ వరకు మాస్టర్ కార్డ్ యూజర్లకు మాత్రమే విక్రయించారు. ఆ తర్వాత ఆగస్ట్ 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 3 వరకు టికెట్లను బుక్ మై షో ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. 

దీంతో సెకండరీ మార్కెట్లో క్రికెట్ మ్యాచ్ ల టికెట్లకు డిమాండ్ ఏర్పడింది. లైవ్ మ్యాచ్ ల సెకండరీ టికెట్ల విక్రయ వేదిక ‘వైగోగో’లో టికెట్ల ధరలు భారీ స్థాయికి చేరాయి. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్ల ధర రూ.41,118 నుంచి రూ.1.67 లక్షల మధ్య పలుకుతోంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ల ధరలు కనిష్ఠంగా రూ.57,198 పలుకుతుంటే, గరిష్ఠ ధర రూ.57.15 లక్షలకు చేరింది. ఈ ధరలు చూసి క్రికెట్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 టికెట్లకు పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ ఏర్పడినట్టు విమర్శలు వస్తున్నాయి.
IND vs PAK
World Cup
ticket prices
explodes

More Telugu News