Prabhas: స్వీటీకి ఇష్టమైన వంటకం ఏంటో ఇన్నాళ్లకు తెలిసింది: ప్రభాస్

Prabhas says he did not know what Sweety favorite dish till now
  • విడుదలకు సిద్ధమైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 
  • ఇందులో చెఫ్ పాత్ర పోషించిన అనుష్క
  • రెసిపీ చాలెంజ్ ప్రారంభించిన స్వీటీ
  • ప్రభాస్ ను నామినేట్ చేసిన వైనం
  • అనుష్క చాలెంజ్ స్వీకరిస్తున్నట్టు తెలిపిన ప్రభాస్
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నటి అనుష్క ఫుడ్ రెసిపీ చాలెంజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటగా ఆమె ప్రభాస్ కు చాలెంజ్ విసిరారు. తనకిష్టమైన మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు నీర్ దోసె రెసిపీలను పంచుకున్న అనుష్క... ప్రభాస్ ను నామినేట్ చేస్తూ,  ఇష్టమైన రెసిపీ ఏంటో పంచుకోవాలని ప్రభాస్ ను కోరారు. అందుకు ప్రభాస్ వెంటనే స్పందించారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ చాలెంజ్ ను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. 

స్వీటీ (అనుష్క అసలు పేరు) తనకు చాలాకాలంగా తెలుసని, కానీ ఇప్పటిదాకా ఆమెకు ఇష్టమైన వంటకం ఏంటో తనకు తెలియదని ప్రభాస్ పేర్కొన్నారు. ఇప్పటికి తెలిసిందని వెల్లడించారు. 

"ఫుడ్ రెసిపీ చాలెంజ్ ను నేను స్వీకరిస్తున్నా. నాకు ఇష్టమైన రొయ్యల పులావ్ రెసిపీని పంచుకుంటున్నాను. ఈ క్రమంలో నేను రామ్ చరణ్ ను ఈ చాలెంజ్ కు నామినేట్ చేస్తున్నాను. రామ్ చరణ్ తనకు ఇష్టమైన రెసిపీని పంచుకోవాలని, అనంతరం మరొకరిని నామినేట్ చేయాలని కోరుతున్నాను" అంటూ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. అభిమానులు కూడా తమకిష్టమైన రెసిపీలు తనతో పంచుకోవాలని ప్రభాస్ పిలుపునిచ్చారు. 

"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెప్టెంబరు 7న థియేటర్లలోకి వస్తోంది... అందరూ చూసి ఆనందించండి. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అంటూ ప్రభాస్ తన పోస్టులో పేర్కొన్నారు.
Prabhas
Anushka Shetty
Sweety
MSMP Recipe Challenge
Miss Shetty Mr Polishetty

More Telugu News