Vijayasai Reddy: అమరావతిపై చంద్రబాబు ప్రేమ అసలు గుట్టు ఇదీ!: విజయసాయిరెడ్డి

Vijaya Sai Reddy reveals why Chandrababu concentrated on amaravati capital
  • బాబు రెండు తాత్కాలిక భవనాలు కట్టి వందల కోట్లు కొట్టేశారన్న విజయసాయి  
  • శాశ్వత భవనాలు కట్టి ఉంటే ఎన్ని లక్షల కోట్ల ముడుపులు తీసుకునేవారోనని ట్వీట్
  • తన అవినీతిపై చంద్రబాబు ఎదురుదాడికి దిగుతాడు చూడండని వ్యాఖ్య
రాజధాని పేరుతో అమరావతిలో షెడ్ల వంటి రెండు తాత్కాలిక భవనాలు కట్టి వందలకోట్లు కొట్టేసిన టీడీపీ అధినేత చంద్రబాబు శాశ్వత భవనాలు కట్టి ఉంటే ఎన్ని లక్షల కోట్ల ముడుపులు తీసుకునే వారో అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా విమర్శలు గుప్పించారు.

అమరావతిలో షెడ్లలాంటి రెండు తాత్కాలిక భవనాలు కట్టి వందల కోట్లు కొట్టేశారంటే, ఇక శాశ్వత సచివాలయ భవనాలు అయివుంటే లక్షల కోట్లు ముడుపులు తీసుకునేవారేమోనంటూ టీడీపీ అధినేతను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే అంటూ చురకలు అంటించారు.

ఇటీవల ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వీటిపై చంద్రబాబు ఇలాంటి వాదనకు దిగుతారంటూ చురకలు అంటించారు. ఈ మేరకు ట్వీట్‌లో... 'చంద్రబాబు రూ.118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు దిగుతాడు... ఏముంది.. బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది.. కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా? 2G స్కాం కేసు ఏమైంది? వాటితో పోలిస్తే ఇదెంత? ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటార'ని ఎదురుదాడికి దిగుతాడు వేచి చూడండని పేర్కొన్నారు.
Vijayasai Reddy
Chandrababu
Telugudesam
Amaravati

More Telugu News