CARD Prime 2.0: నూతన రిజిస్ట్రేషన్ విధానంపై అపోహలు వద్దు: ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ

  • ఏపీలో నూతన రిజిస్ట్రేషన్ విధానం
  • కార్డ్ ప్రైమ్ 2.0 పేరిట కొత్త సాఫ్ట్ వేర్ తీసుకువచ్చిన ప్రభుత్వం
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు
  • కార్డ్ 2.0పై అవగాహన సదస్సులు చేస్తున్న ప్రభుత్వం
AP Stamps and Registrations IG Ramakrishna talks about new software

ఏపీ ప్రభుత్వం కార్డ్ ప్రైమ్ 2.0 పేరిట రిజిస్ట్రేషన్ల కోసం నూతన సాఫ్ట్ వేర్ ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని సెప్టెంబరు 1 నుంచి అమలు చేస్తోంది. సెప్టెంబరు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఈలోపు నూతన రిజిస్ట్రేషన్ విధానంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. 

విశాఖలో ఇవాళ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మాట్లాడుతూ, కొత్త విధానంపై చాలా అపోహలు ఉన్నాయని తెలిపారు. తాము కొత్తగా తీసుకువచ్చిన కార్డ్ ప్రైమ్ 2.0 విధానంతో సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించారు. కార్డ్ 2.0 ఎంతో భద్రత, సురక్ష సాంకేతికతో కూడిన సాఫ్ట్ వేర్ అని స్పష్టం చేశారు. 

ఈ సాఫ్ట్ వేర్ సాయంతో ఎక్కడైనా దస్తావేజులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. దస్తావేజులతో పాటు లింక్ డాక్యుమెంట్లు కూడా దీంట్లో చూడొచ్చని ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఆన్ లైన్ లో తప్పులొస్తే కార్యాలయానికి వెళ్లి సరిచేసుకోవచ్చని అన్నారు.

More Telugu News