Apple: ఐఫోన్ 15 నుంచి కొత్త లెదర్ కేసు

  • పర్యావరణ అనుకూల మెటీరియల్స్ తో కొత్త కేసు
  • ఇప్పటి వరకు ఉన్న లెదర్ కేసుకు గుడ్ బై
  • అచ్చం లెదర్ ను పోలినట్టుగా తయారీ
Apple has created new type of case material for iPhone 15

యాపిల్ ఐఫోన్ 15 నుంచి యూజర్లు కొత్త కేస్ ను చూడబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న లెదర్ కేసును యాపిల్ తొలగించనుందన్నది తాజా సమాచారం. పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ కేసును తీసుకురానుంది. ఇందుకు సంబంధించి కొన్ని లీకైన ఇమేజ్ లు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. యాపిల్ కొత్తగా తీసుకురాబోయే కేస్ మెటీరియల్ కూడా చూడ్డానికి, తాకితే అచ్చం లెదర్ మాదిరే ఉంటుంది. కాకపోతే దీన్ని జంతు చర్మంతో తయారు చేయరు.

ప్రస్తుతం ఉన్న లెదర్ కేసును యాపిల్ 2013లో ఐఫోన్ 5ఎస్ తో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డిజైన్, రంగుల పరంగా పలు మార్పులు చేశారు. పర్యావరణ అనుకూల మెటీరియల్ తో కొత్త కేస్ ను తయారు చేసినట్టు సమాచారం. కాకపోతే ఎలాంటి మెటీరియల్స్ ను తయారీలోకి వినియోగించారన్న వివరాలు లేవు. మరి యాపిల్ తీసుకొచ్చే కొత్త కేస్ ఎలా ఉంటుందో చూడాలంటే పది రోజులు ఆగాల్సిందే. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 12న ఆవిష్కరించొచ్చని తెలుస్తోంది.

More Telugu News