ODI World Cup: వన్డే ప్రపంచకప్ కు టీమిండియా జట్టు ప్రకటన

BCCI announces Team Indian ODI squad for world cup
  • 2023 వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న భారత్
  • అక్టోబర్ 5న ప్రారంభం కానున్న ప్రపంచకప్
  • టీమిండియాకు నాయకత్వం వహించనున్న రోహిత్ శర్మ
అక్టోబర్ లో ఇండియాలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. 

2023 వన్డే వరల్డ్ కప్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.

అక్టోబర్ 5న ప్రపంచకప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఇండియా తన తొలి మ్యాచ్ ను 8వ తేదీన ఆస్ట్రేలియాతో ఆడనుంది. దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ 14వ తేదీన జరగనుంది.
ODI World Cup
Team India
Squad
BCCI

More Telugu News