Rohit Sharma: నేపాల్‌తో మ్యాచ్‌లో పలు రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ

  • నేపాల్‌పై 59 బంతుల్లో 74 పరుగులు సాధించిన రోహిత్
  • ఆసియాకప్‌లో అత్యధిక అర్ధ సెంచరీ రికార్డు
  • దిగ్గజ ఆటగాడు సచిన్ రికార్డు బద్దలు
  • ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన తొలి ఇండియన్‌గా మరో ఘనత
Rohit Sharma Creates Records In Asia Cup 2023

ఆసియాకప్‌లో భాగంగా నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేసిన టీమిండియా సారథి రోహిత్‌శర్మ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాకప్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 

ఆసియాకప్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 9 అర్ధ సెంచరీలతో ఇప్పటి వరకు టాప్ ప్లేస్‌లో ఉండగా రోహిత్ 10 హాఫ్ సెంచరీలతో అతడిని అధిగమించాడు. అలాగే, ఆసియాకప్ వన్డే ఫార్మాట్‌లో 23 సిక్సర్లతో మరో రికార్డును తనపేరున రాసుకున్నాడు. 18 సిక్సర్లతో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సురేశ్ రైనా రికార్డును బద్దలుగొట్టాడు. ఓవరాల్‌గా 26 సిక్సర్లతో షాహిద్ అఫ్రిది, 23 సిక్సర్లతో సనత్ జయసూర్య ముందున్నారు.

More Telugu News