Vijayasai Reddy: ఇంకెంతో కాలం నీ ఆటలు సాగవ్ బాబూ!: విజయసాయిరెడ్డి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆటలు ఇంకెంతో కాలం సాగవని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఐటీ శాఖ నోటీసుల నేపథ్యంలో టీడీపీ అధినేతపై వైసీపీ ఎంపీ విమర్శలు గుప్పించారు. అడ్డంగా దొరికినా అడ్డగోలుగా బుకాయించే వ్యక్తి చంద్రబాబు అని, ఆయన చరిత్రే అంత అని సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.
రూ.118 కోట్ల కమీషన్ పై ఇక్కడున్న ఐటీ ఆఫీస్ నోటీసు ఇవ్వకుండా సెంట్రల్ ఆయకార్ భవన్ ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించడం విడ్డూరమన్నారు. ఓటుకు నోటు కేసులోనూ అలాగే చేశారని ధ్వజమెత్తారు. 2001లోనే తెహల్కా సంస్థ చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిందన్నారు. కానీ ఇంకెంతో కాలం చంద్రబాబు ఆటలు సాగవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.