Virat Kohli: అజారుద్దీన్ తర్వాత అరుదైన రికార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Virat Kohli completes 100 catches in cricket tourneys
  • క్రికెట్ టోర్నీల్లో 100 క్యాచ్ లు పట్టిన తొలి భారత ఆటగాడు అజార్
  • తాజాగా నేపాల్ తో మ్యాచ్ లో కోహ్లీ సింగిల్ హ్యాండ్ క్యాచ్
  • క్రికెట్ టోర్నీల్లో 100 క్యాచ్ లు పూర్తి చేసుకున్న కోహ్లీ
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వికెట్ కీపర్ కాకుండా, క్రికెట్ టోర్నీల్లో 100 క్యాచ్ లు అందుకున్న రెండో భారతీయ ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. ఇవాళ ఆసియా కప్ లో నేపాల్ తో మ్యాచ్ లో కోహ్లీ సింగిల్ హ్యాండ్ తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. తద్వారా, అజారుద్దీన్ తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. 

ఇక వన్డేల్లో 143 క్యాచ్ లతో కోహ్లీ ఓవరాల్ గా నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు, ప్రస్తుత తరం ఆటగాళ్లలో వన్డేలు, టీ20ల్లో అత్యధిక క్యాచ్ ల రికార్డు కూడా కోహ్లీ (193) పేరిటే ఉంది. కోహ్లీ వన్డేల్లో 143, టీ20ల్లో 50 క్యాచ్ లు పట్టాడు.
Virat Kohli
Record
Azharuddin
Indian
Cathces
Cricket Tourneys

More Telugu News