akula srivani: బీజేపీ నుంచి 4 నియోజకవర్గాలకు దరఖాస్తు చేసిన సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి

Akula Srivani files for 4 constituencies from BJP
  • మహేశ్వరం, ఎల్బీనగర్, ముషీరాబాద్, సనత్ నగర్‌ల నుండి ఆసక్తి కనబరిచిన శ్రీవాణి
  • బీజేపీ తరఫున పోటీ చేసేందుకు మొదటిరోజే 182 దరఖాస్తులు
  • ఎల్బీ నగర్ టిక్కెట్ కోసం సామ రంగారెడ్డి, వేములవాడ నుండి తుల ఉమ ఆసక్తి
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఈ రోజు (సోమవారం) నుండి ఎమ్మెల్యే అభ్యర్థుల ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలి వచ్చారు. మొదటి రోజే 182 మంది దరఖాస్తు చేసుకున్నారు.

సరూర్ నగర్ కార్పొరేటర్‌గా ఉన్న ఆకుల శ్రీవాణి నాలుగు నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్నారు. మహేశ్వరం, ఎల్బీనగర్, ముషీరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల నుండి పోటీకి ఆసక్తి కనబరుస్తూ ఆమె దరఖాస్తు ఇచ్చారు. ఎల్బీ నగర్ టిక్కెట్ కోసం సామ రంగారెడ్డి దరఖాస్తు ఇచ్చారు. వేములవాడ నుండి తుల ఉమ ఆసక్తి చూపారు. మొదటి దరఖాస్తు సికింద్రాబాద్ నుండి హరిప్రసాద్ గౌడ్ ఇచ్చారు.
akula srivani
BJP
Telangana Assembly Election

More Telugu News