AP Govt: అంగళ్లు, పుంగనూరు ఘటనలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

  • ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త ఘటనలు
  • టీడీపీ నేతలపై కేసులు
  • ఒక్క చల్లా బాబుపైనే 7 కేసులు
  • టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు
  • హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కారు
AP Govt approach supreme court on high court verdict

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, చల్లా బాబు, పులివర్తి నానిలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

ఒక్క చల్లా బాబుపైనే 7 కేసులు పెట్టగా, నాలుగు కేసుల్లో  బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.

More Telugu News