Madhu Yaskhi: గాంధీ భవన్ వద్ద పోస్టర్ల కలకలం.. కోవర్టుల సంగతి తేలుస్తానంటూ మధుయాష్కీ ఆగ్రహం

  • గో టు నిజామాబాద్, ఎల్బీ నగర్ రావొద్దంటూ గాంధీ భవన్ వద్ద యాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు
  • పోస్టర్ల వెనుక సుధీర్ రెడ్డి హస్తం ఉందంటూ మధుయాష్కీ ఆరోపణ
  • సుధీర్ ఎంగిలి మెతుకులకు ఆశపడేవారు ఇలా చేస్తున్నారని ఆగ్రహం
Madhu Yashki fires party covert leaders over flexy in gandhi bhavan

గాంధీ భవన్ వద్ద మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. గో టు నిజామాబాద్, ఎల్బీ నగర్ రావొద్దంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లపై యాష్కీ తీవ్రంగా స్పందించారు. తనపై వెలిసిన పోస్టర్ల వెనుక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. అతను కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన వ్యక్తి అన్నారు. ఓటమి భయంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

సుధీర్ రెడ్డి ఎంగిలి మెతుకులకు ఆశపడేవారు ఇలాంటి కుట్రలు తనపై చేస్తున్నారన్నారు. పార్టీలోని కోవర్టుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ఎంగిలి మెతుకులు తినడం ఆపేసుకోవాలన్నారు. నిజమైన కార్యకర్తలను కాపాడుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం 25 సీట్లు కూడా రావన్నారు. కాగా, ఎల్బీ నగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు యాష్కీ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ పోస్టర్లతో నాకు సంబంధం లేదు: జక్కిడి

గాంధీ భవన్ వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్లతో తనకు సంబంధం లేదని ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఇంఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎల్బీ నగర్ లో చేసిన సర్వేలో తాను గెలుస్తానని తెలిసిందని, సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని, టిక్కెట్ కూడా తనకే వస్తుందన్నారు. తన గెలుపు కోసం నియోజకవర్గంలో పని చేసుకుంటున్నట్లు చెప్పారు.

More Telugu News