Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రక్తపు మడుగులో ఎయిర్ హోస్టెస్.. స్వీపర్ అరెస్ట్

Air hostess found dead in Mumbai
Advertisement
  • ముంబైలో రూపాల్ అనే ఎయిర్ హోస్టెస్ మృతి
  • 40 ఏళ్ల విక్రమ్ అత్వాల్ ను విచారిస్తున్న పోలీసులు
  • కొన్ని రోజుల క్రితం రూపాల్ కు, విక్రమ్ కు మధ్య వాగ్వాదం
Advertisement
ముంబైలో రూపాల్ ఓగ్రే (25) అనే ఒక ట్రైనీ ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పదంగా మృతి చెందింది. చత్తీస్ గఢ్ కు చెందిన ఆమె ఎయిరిండియాకు ఎంపికయింది. అంధేరీలోని ఒక హౌసింగ్ సొసైటీలో ఒక ఫ్లాట్ లో తన సోదరి, ఆమె బోయ్ ఫ్రెండ్ తో కలిసి ఉంటోంది. కొన్ని రోజుల క్రితం వాళ్లిద్దరూ గ్రామానికి వెళ్లడంతో రూపాల్ ఒక్కతే ఫ్లాట్ లో ఉంటోంది. నిన్న సాయంత్రం రూపాల్ కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. 

దీంతో ముంబైలో ఉన్న ఆమె స్నేహితులకు ఫోన్ చేసి ఫ్లాట్ కు వెళ్లి చూడాలని కోరారు. దీంతో ఆమె స్నేహితులు ఫ్లాట్ వద్దకు వచ్చారు. లోపల నుంచి తాళం పెట్టి ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల వచ్చి తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా రూపాల్ రక్తపు మడుగులో ఉంది. అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ కేసులో 40 ఏళ్ల విక్రమ్ అత్వాల్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే హౌసింగ్ సొసైటీలో అతను స్వీపర్ గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం రూపాల్ కు, అతనికి వాగ్వాదం జరిగినట్టు సమాచారం.
Advertisement
Advertisement
Air Hostess
Death

More Telugu News