Muthaiah Muralitharan: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ట్రైలర్ విడుదలకు చీఫ్ గెస్ట్ గా క్రికెట్ గాడ్

Sachin is chief guest for Muthaiah Muralitharan biopic 800 trailer launch programme
  • '800' పేరుతో తెరకెక్కుతున్న మురళీధరన్ బయోపిక్
  • సెప్టెంబర్ 5న విడుదలవుతున్న ట్రైలర్
  • కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వస్తున్న సచిన్ టెండూల్కర్
ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక లెజెండరీ స్రిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా '800' పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రను 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ పోషిస్తున్నాడు. సెప్టెంబర్ 5న ముంబైలో ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ హాజరవుతున్నాడు. ఈ చిత్రాన్ని ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఆలిండియా పంపిణీ హక్కులను శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సచిన్ వస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
Muthaiah Muralitharan
Biopic
Bollywood
Sachin Tendulkar

More Telugu News