ఆసియా కప్: నేపాల్ పై టాస్ గెలిచిన టీమిండియా

Team India has won the toss and elected bowl first against Nepal in Asia Cup
ఆసియా కప్ లో టీమిండియా నేడు నేపాల్ తో తలపడుతోంది. పాకిస్థాన్ తో మ్యాచ్ వర్షార్పణం అయిన నేపథ్యంలో, ఈ మ్యాచ్ లో భారత్ కు గెలుపు తప్పనిసరి. శ్రీలంకలోని పల్లెకెలె మైదానం ఈ గ్రూప్-ఏ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్ లో భారత్ బుమ్రా లేకుండానే బరిలో దిగుతోంది. బుమ్రా భార్య సంజనా గణేశన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ఈ మ్యాచ్ కు బుమ్రా అందుబాటులో ఉండడంలేదు. బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. అటు, నేపాల్ టీమ్ కు కూడా ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్ లో ఆ జట్టు పాకిస్థాన్ చేతిలో 238 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
Go Back to Shorts
Team India
Nepal
Toss
Bowling
Asia Cup
Pallekele
Sri Lanka

More Telugu News