Balakrishna: బాలయ్యను చూస్తే సొంత బాబాయ్​లానే అనిపించింది: శ్రీలీల

Sreeleela all praises for balakrishna
  • బాలయ్యతో ‘భగవంత్ కేసరి’లో నటించిన యువ హీరోయిన్
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా
  • ఇటీవల వచ్చిన తొలి పాటకు మంచి స్పందన
ప్రస్తుతం టాలీవుడ్‌లో యువ హీరోయిన్‌ శ్రీలీల హవా నడుస్తోంది. చిన్న వయసులోనే అటు యువ హీరోలు, ఇటు స్టార్లతో నటిస్తోంది. సీనియర్ హీరో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న‘భగవంత్‌ కేసరి’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్య, శ్రీలీల బాబాయ్‌, కూతుళ్లుగా నటించారు. చిత్రం నుంచి ఇటీవల విడుదలైన తొలి పాటలో ఇద్దరూ తమ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు.

‘భగవంత్‌ కేసరి’ విశేషాలు, బాలయ్యతో తెర పంచుకున్న అనుభవాలను శ్రీలీల తాజాగా వెల్లడిస్తూ, బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సినిమా చేస్తున్నంతసేపు ఆయన తనకు సొంత బాబాయ్‌లాగే అనిపించారని చెప్పింది. సెట్ లో బాలయ్య సైతం తనను అలాగే చూసుకున్నారని చెప్పింది. మరో అవకాశం వస్తే మళ్లీ బాలయ్యతో నటించాలని ఉన్నట్టు తెలిపింది. ఇక, సెట్‌లో సాటి నటులకు బాలకృష్ణ ఇచ్చే గౌరవం చూసి తాను ఫిదా అయిపోయానని చెప్పింది.
Balakrishna
sreeleela
Tollywood
bhagavanth kesari

More Telugu News