ISRO: ఇస్రో 'కౌంట్‌ డౌన్' విధుల ఉద్యోగిని గుండెపోటుతో మృతి

  • ఇస్రో కౌంట్ డౌన్ విధుల ఉద్యోగి వాలర్‌మతికి గుండెపోటు
  • గురువారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • చంద్రయాన్-3 సహా పలు కీలక మిషన్లలో కౌండ్ డౌన్ విధులు నిర్వహించిన శాస్త్రవేత్త 
ISRO valamarthi succumbs to heart attack

భారత అంతరిక్ష సంస్థ ప్రయోగాల సమయంలో..3, 2, 1.. అంటూ కౌంట్ డౌన్ విధులు నిర్వహించే శాస్త్రవేత్త వాలర్‌మతి (64) గురువారం మృతి చెందారు. గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఇటీవలి చంద్రయాన్-3 మిషన్‌లో చివరిసారిగా ఆమె కౌంట్ డౌన్ విధులు నిర్వర్తించారు.

More Telugu News