G-20: జీ-20 సదస్సుకు వచ్చే విదేశీ అతిథుల కోసం నోరూరించే వంటకాలు

  • సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 సదస్సు
  • భారత్ రానున్న వివిధ దేశాధినేతలు
  • ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లలో బస
  • 250 రకాల దేశీయ, విదేశీ వంటకాలతో మెనూ
Delicious food for G20 delegates

ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు విదేశీ అతిథులు పెద్ద సంఖ్యలో రానున్నారు. వివిధ దేశాధినేతలు వస్తుండడంతో వారి కోసం నోరూరించే వంటకాలు సిద్ధం చేయనున్నారు. ప్రపంచ దేశాధినేతలకు, వారితో పాటు వచ్చే అధికారులు, ప్రతినిధుల బృందాలకు పేరుమోసిన హోటళ్లలో బస ఏర్పాటు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, ఆయా హోటళ్లలో రుచికరమైన, భారతీయ విశిష్టతను చాటే వంటకాలను అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా, తృణ ధాన్యాలతో తయారైన వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డించనున్నారు. 

జీ-20 సదస్సు అతిథులకు అందించే మెనూలో దేశంలోని పలు రాష్ట్రాల ఫేమస్ వంటకాలు, విదేశీ వంటకాలు సిద్ధం చేయనున్నారు. మొత్తం 250 రకాల స్వదేశీ, విదేశీ వంటకాలకు మెనూలో చోటు కల్పించారు. అతిథి మర్యాదలకు ఎలాంటి లోటు ఉండకూడదని కేంద్రం భావిస్తోంది.

More Telugu News