Vangaveeti Radha: ఘనంగా వంగవీటి రాధా నిశ్చితార్థం... అక్టోబరులో పెళ్లి

  • త్వరలో ఓ ఇంటివాడు కానున్న టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ
  • జక్కం పుష్పవల్లితో రాధా ఎంగేజ్ మెంట్
  • నరసాపురంలో ఘనంగా నిశ్చితార్థం వేడుక
Vangaveeti Radha engagement with Jakkam Pushpavalli

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. వంగవీటి రాధా నిశ్చితార్థం జక్కం పుష్పవల్లితో నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల వారు హాజరై కాబోయే దంపతులను దీవించారు. 

ఈ నిశ్చితార్థం నరసాపురంలో పెద్దల సమక్షంలో జరిగింది. ప్రభుత్వ చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

రాధా చేసుకోబోయే జక్కం పుష్పవల్లి స్వస్థలం నరసాపురం పట్టణం. ఏలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె పుష్పవల్లి. వంగవీటి రాధా, పుష్పవల్లిల వివాహం అక్టోబరులో జరగనున్నట్టు తెలుస్తోంది. కాగా, రాధా ఓ ఇంటివాడు కానుండడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

More Telugu News