Heath Streak: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ మృతి

  • క్యాన్సర్ తో 49 ఏళ్ల హీత్ స్ట్రీక్ మృతి
  • ఈ తెల్లవారుజామున కన్నుమూత
  • 1993 నుంచి 2005 వరకు జింబాబ్వే జట్టుకు ఆడిన స్ట్రీక్
Zimbabwe Cricketer Heath Streak passes away

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశాడు. ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 49 ఏళ్ల స్ట్రీక్ చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. జింబాబ్వే తరపున 1993 నుంచి 2005 వరకు హీత్ స్ట్రీక్ ఆడాడు. ఆ దేశ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. తన కెరీర్ లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లతో కలిపి 4,933 పరుగులు చేసి, 455 వికెట్లు పడగొట్టాడు. 

జింబాబ్వే తరపున టెస్టుల్లో వెయ్యి పరుగులు, 100 వికెట్లు... వన్డేల్లో 2 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా హీత్ స్ట్రీక్ పేరిట రికార్డు ఉంది. ఆయన మృతి పట్ల మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు.

More Telugu News