Kesineni Nani: ఎవరు అడ్డొచ్చినా విజయవాడ పశ్చిమ నుంచి ఆయనను గెలిపిస్తా: కేశినేని నాని

I will make Baig to win in Vijayawada West says Kesineni Nani
  • టీడీపీలో కలకలం రేపుతున్న కేశినేని నాని వ్యాఖ్యలు
  • ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న బుద్దా వెంకన్న
  • గతంలో ఇదే స్థానం నుంచి టికెట్ ఆశించిన నాగుల్ మీరా
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నుంచి ఎవరు అడ్డొచ్చినా బేగ్ ను ఎమ్మెల్యేగా చేస్తానని వ్యాఖ్యానించారు. కేశినేని నాని వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బుద్దా వెంకన్న పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. 

మరోవైపు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి నాగుల్ మీరా కూడా కూడా టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలో బేగ్ ను రంగంలోకి దింపి గెలిపించుకుంటానని కేశినేని నాని చెప్పడం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Kesineni Nani
Telugudesam
Vijayawada
West

More Telugu News