Nara Lokesh: టీడీపీ హయాంలో ఒక్క బీసీపై అయినా దాడి జరిగిందా?: నారా లోకేశ్

  • ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ యువగళం
  • నీలాద్రిపురం శివార్లలో ఘనస్వాగతం
  • ఉంగుటూరులో బీసీ వర్గీయులతో లోకేశ్ సమావేశం
Nara Lokesh held meeting with BC communities people

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. గోపాలపురం నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన యువగళం పాదయాత్ర శనివారం ఉదయం నీలాద్రిపురం శివార్లలో ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఏలూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ చార్జి గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఉంగుటూరు ప్రజలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంచుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే పథకాలను లోకేశ్ వివరించారు. దారిపొడవునా దళితులు, తూర్పుకాపులు, ఆక్వారైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఉంగుటూరు బీసీ సామాజికవర్గ ప్రతినిధులతో సమావేశమై వారి సాధకబాధకాలు విన్నారు. 

మేం అధికారంలోకి వస్తే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

టీడీపీ ఆవిర్భావం తరువాతే బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది. బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీఆర్ అయితే, 34 శాతానికి పెంచింది చంద్రబాబు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీల పై 26 వేల అక్రమ కేసులు పెట్టింది. టీడీపీలో ఉన్న బీసీ నాయకుల్ని కేసులు పెట్టి వేధించింది. టీడీపీ హయాంలో ఒక్క బీసీపై అయినా దాడి జరిగిందా? మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

జగన్ పాలనలో కీలక పదవుల్లో ఎవరున్నారో చూడండి! 

పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది టీడీపీ. ఆదరణ పథకం ప్రవేశ పెట్టి కుల వృత్తులను కాపాడాం. టీడీపీ హయాంలో బీసీలకు కీలక పదవులు ఇచ్చాం. జగన్ పాలనలో కీలక పదవుల్లో ఎవరు ఉన్నారో ఒకసారి చూడండి. బీసీలు అంటే బలహీన వర్గాలు కాదు... బలమైన వర్గం అనేది టీడీపీ సిద్దాంతం. 

బీసీ సబ్ ప్లాన్, కార్పొరేషన్ ద్వారా ప్రతి ఏడాది ప్రతి ఏటా రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ వచ్చాక బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి 16 వేల మందిని పదవులకు దూరం చేశాడు. 

బీసీ సబ్ ప్లాన్ నిధుల పక్కదారి

జగన్ బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించాడు. జగన్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకి అయ్యే ఖర్చుని బీసీల ఖాతాలో రాసి మోసం చేస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెం.217 రద్దు చేస్తాం. చెరువులపై మత్స్యకారులకు హక్కులు కల్పిస్తాం. 

కొల్లేరుపై ఆధారపడిన వారు పడుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. త్వరలోనే దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యల గురించి తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తాను. ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం.

పలు గ్రామాల ప్రజలు తనను కలిసిన సందర్భంగా లోకేశ్ స్పందన...

  • ఎన్నికలకు ముందు బుగ్గలు నిమిరి ముద్దులు పెడుతూ ఎస్సీలపై కపట ప్రేమ చూపిన జగన్ అధికారంలోకి వచ్చాక తమ నిజస్వరూపం చూపుతున్నాడు. 
  • జగన్ అధికారంలోకి వచ్చాక దక్షిణ భారతదేశం మొత్తమ్మీద దళితులపై దాడుల్లో ఏపీ ప్రథమస్థానంలో ఉంది. గత 51 నెలలుగా ఇదివరకెన్నడూ లేని విధంగా దళితుల హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి.
  • ఎస్సీల కోసం ఖర్చు చేయాల్సిన రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. 
  • దళితులకు గత ప్రభుత్వం అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను రద్దుచేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన దళితులపై పోలీసులను అడ్డంపెట్టుకుని దమనకాండ సాగిస్తున్నాడు. 
  • టీడీపీ హయాంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా అది దళిత వాడల నుండే ప్రారంభించేవాళ్లం.
  • జగన్మోహన్ రెడ్డి పాలనలో తూర్పు కాపులతో పాటు అన్ని రకాల బీసీలు అణచివేతకు గురయ్యారు. న్యాయబద్ధంగా తమకురావాల్సిన హక్కులకోసం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. 
  • తూర్పు కాపులకు రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ. కిమిడి మృణాళిని, కళా వెంకట్రావుకు మంత్రి పదవులిచ్చి గౌరవించాం. అధికారంలోకి వచ్చాక దామాషా ప్రకారం తూర్పు కాపులకు నిధులు కేటాయిస్తాం.
  • జె-ట్యాక్స్ విధానాలతో జగన్ ఆక్వారంగాన్ని సర్వనాశనం చేశాడు. గతంలో దేశం మొత్తమ్మీద ఏపీ నుంచే అత్యధిక ఆక్వా ఎగుమతులు జరిగేవి. 
  • ఆక్వారైతులకు విద్యుత్ సబ్సిడీ విషయలో జగన్ మాట తప్పి, మడమ తిప్పారు. జోన్ల పేరుతో విభజించి యూనిట్ ధర రూ.4.50లకు పెంచాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జోన్లతో సంబంధం లేకుండా ఆక్వారైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50లకే అందజేస్తాం. 
  • ఆక్వారైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్ అందించేలా చర్యలు తీసుకుంటాం. ట్రాన్స్ ఫార్మర్లపై జగన్ ప్రభుత్వం మోపిన అదనపు భారాన్ని తగ్గిస్తాం. ఆక్వారైతులు నిర్మించే కోల్డ్ స్టోరేజిలకు సబ్సిడీలను అందజేసి ప్రోత్సహిస్తాం.

ఇస్త్రీ బంకు కార్మికుడితో లోకేశ్ మాటామంతీ

ఉంగుటూరు నియోజకర్గం నారాయణపురంలో ఇస్త్రీ షాపు నిర్వహిస్తున్న జంపా యల్లయ్యను లోకేశ్ కలిసి ఆయన సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 51 నెలల జగనాసురుడి పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని విమర్శించారు. 

పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్నిరకాల పన్నులను సమీక్షించి, ధరలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. రజకులకు దోబీఘాట్ల నిర్మాణం చేపడతామని, వాషింగ్ మిషన్లున్న రజకులకు విద్యుత్ రాయితీ ఇస్తామని వివరించారు. 

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2752.7 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 22.4 కి.మీ.*

*203వరోజు (3-9-2023) యువగళం వివరాలు*

*ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)*

ఉదయం

8.00 – చిననిండ్రకొలను క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.00 – పెదనిండ్రకొలను సెంటర్ లో కాపు సామాజికవర్గీయులతో భేటీ.

11.00 – నిడమర్రు గుడి వద్ద స్థానికులతో మాటామంతీ.

మధ్యాహ్నం

12.00 – నిడమర్రు ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం.

1.30 – భువనపల్లిలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – భువనపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

5.30 – గణపవరం జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

6.50 – గణపవరంలో స్థానికులతో మాటామంతీ.

7.50 – పాదయాత్ర ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

రాత్రి

8.20 – ఆరేడులో స్థానికులతో సమావేశం.

9.05 – కోలమూరు శివారు విడిది కేంద్రంలో బస.

******

More Telugu News