Hyderabad: అమెరికాలో హైదరాబాదీ వివాహిత ఆత్మహత్య

Hyderabadi married woman commits suicide in usa over health issues
  • మిస్సోరీ రాష్ట్రంలో భర్తతో కలిసి ఉంటున్న కవితకు కొంతకాలంగా అనారోగ్యం
  • నగరంలోని ఎల్బీనగర్‌లో నివాసముంటున్న కవిత అత్తమామలు
  • శారీరక ఇబ్బందులతో గురువారం ఇంట్లో కవిత ఉరివేసుకుని ఆత్మహత్య
అమెరికాలో ఉంటున్న ఓ హైదరాబాదీ మహిళ అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే, నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలానికి చెందిన ఏనుగు మల్లారెడ్డి, అనసూయ దంపతులు నగరంలోని ఏల్బీనగర్‌లో కామినేని ఆసుపత్రి వెనుక ఉన్న సూర్యోదయ కాలనీలో ఉంటున్నారు. ఆ దంపతుల కుమారుడు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో సిర్థపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఆయనకు 18 ఏళ్ల క్రితం కవిత(40)తో వివాహమైంది. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో అవస్థలు పడుతున్న కవిత గురువారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Hyderabad
USA
Crime News

More Telugu News