Tirumala: ఆగస్ట్ లో తిరుమల శ్రీవారికి కళ్లు చెదిరే ఆదాయం!

  • ఆగస్ట్ లో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22.25 లక్షలు
  • హుండీకి రూ. 120.05 కోట్ల ఆదాయం
  • 9 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయం
Tirumala hundi income in August is Rs 120 Cr

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మారుమోగుతున్నాయి. మరోవైపు శ్రీవారి ఆదాయం కూడా కళ్లు చెదిరే రీతిలో ఉంటోంది. ఆగస్ట్ నెలలో మొత్తం 22.25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెలలో శ్రీవారి హుండీకి రూ. 120.05 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్ట్ మాసంలో కోటి 9 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించారు. మరోవైపు సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించబోతున్నారు. అధికమాసం సందర్భంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

More Telugu News